స్వార్దం

Standard

మనిషిని నడిపించేది స్వార్దం కాదట
“మన” అను మమకారమట
“నా” అను భావన వ్యర్దమట
నిస్వార్దమే జీవిత పరమార్దమట
అంతరాత్మను తాకట్టు పెట్టాల్సిందేనట,
ప్రపంచం ముందు మొకరిల్లి దేహీ!అని అడుక్కోవాల్సిందేనట
నీ జీవితం లోకం పెట్టిన భిక్షమట
వారు నిర్ణయించిందే నీ లక్ష్యమట
త్యాగాలా పై వారు ప్రపంచశాంతికి యాగాలు చేస్తారట
వ్యక్తిగత ఆలోచనలని ద్రవంగా కరిగించి హోమంలో పోస్తారట
అది తిరిగి ప్రపంచానికి శాంతి పరిమళాలు వెదజల్లుతుందట
ఇది లోకళ్యాణమట, పచ్చి మోసమట
ఆత్మబలిదానానికి అందమైన మారు పేరట
త్యాగాల తో వచ్చేది శాంతి కాదని
గొంతు కోసి అమౄతాన్ని తాగించలేరని
కళ్ళు పీకి ప్రకౄతి అందాలని చూపలేరని
మనఃశాంతి కి మించిన ప్రపంచశాంతి లేదని
సమూహానికి అంతరంగం ఉండదని,
అది మనిషికి మాత్రమే సాధ్యమని
తెలియక జరుగుతున్న ఘర్షణ
ఇది నా అను నిజానికి, మన అను అభూత కల్పనకి మద్య సంగ్రామం
సమయం మించిపోతుంది – స్వార్ధమా? త్యాగమా?

మలి ప్రయత్నం

Standard

చీకటి జీవితం లో ఒక ఙ్నాపకం మెరిసింది
ఉరుమై మనసులో ఝల్లుమంది
మేఘం గుండె బరువెక్కింది
పుడమి వడిలో విలపిస్తుంది
చెట్టూ చేమా తల్లడిల్లాయి
వాగు వంకా భోరుమన్నయి
ఈ వరద ఉదౄతిని ఆపేదెవ్వరు?
ఈ చీకటి పొరలు చీల్చేదెవ్వరు?
ఎవ్వరొస్తారు ఈ కటిక రాత్రి లో
నీలో నిర్జీవమైన ఆశలని మేల్కొలుపు,
చీకటి జీవితానికి వీడ్కోలు పలుకు
నీ సంకల్ప బలానికి పనిపెట్టు,
ఈ ప్రవాహానికి అడ్డుకట్టు
ఈ చీకటి నది ని ఎదురీది, రేపటి కానుకనందుకో
కొండా కోనల నడుమ, కిలకిలా రాగాల తో
తొలి ఉషస్సు నీకై ఎదురు చుస్తుంది
నునువెచ్చని కిరణ కాంతి లో
పసుప్పచ్చని వర్ణ ప్రకౄతి లో
చిగురించిన కొత్త కోర్కెల తో
ఇదే నీకు తొలి వసంతం
ప్రారంబించు నీ ఆనందపు మలి ప్రయత్నం!

స్వేచ్ఛ

Standard

సాగర ఘొషకు నిశబ్దాన్ని పరిచయం చేస్తూ మౌనంగా కూర్చున్నా

ఆలలు వస్తూ కాళ్ళని తడిపి పోతున్నాయి, ఊహలు మనసుని తాకి పోతున్నట్టు

ఆ అలల కి కుదురు లేదు, నా కలలకి అదుపు లేదు

రెట్టించిన ఉత్తేజంతో ముందుకొస్తున్నయి,వికటించిన ఆశలతో వెనుతిరుగుతున్నాయి

అలుపెరుగని ఆశయం, సాదించాలంటే సంసయం,

కెరటపు కాంక్ష, తీరపు ఆంక్ష

రెంటిమద్యా కొట్టుమిట్టాడుతున్న జీవితపు అల

ఎంత కాలం ఇలా?

పదే పదే అదే కల?

కాంక్ష కి రెక్కలిస్తే, కలల అల ఉప్పెనై పొంగదా?

ఆంక్ష ని ప్రశ్నల తో సమాధిచేస్తే, ఊహ ఊపిరి పోసుకోదా?

తీరు మారాలి, తీరం దాటాలి

మౌనం వీడాలి, కట్టుబాట్లకి చరమ గీతం పాడాలి

ఆలోచనే సారధిగా, విలువలే వారధిగా

సంతోషమే లక్ష్యంగా, జీవితమే సాక్ష్యంగా

కలలు సత్యమై, ఆనందం ఉప్పెనై

జీవించిన క్షణం

ఆ ఉద్విగ్న క్షణం

మనిషి స్వేచ్ఛకి అంకితం.

ప్రశ్న! ఇదినా ప్రశ్న!

Standard

నిశబ్దం! అంతా నిశబ్దం!

దూరంగా వినిపిస్తున్న నక్కల అరపులు, దగ్గరగా రోదిస్తున్న మనుషుల రోదనలు

అయినా ఆ చెవులకు నిశబ్దం! అంతా నిశబ్దం!

 

 

చీకటి! అంతా చీకటి!

దేదీప్యమానంగ ప్రకాశిస్తుంది ఆ దీపం

అయినా ఆ కళ్ళకు చీకటి! అంతా చీకటి!

 

 

సౌఖ్యం! అంతా సౌఖ్యం!

ఆ మంటలు దేహాన్ని దహించి వేస్తున్నయి

అయినా ఆ మేనికి సౌఖ్యం! అంతా సౌఖ్యం!

 

 

శాంతి! అంతా శాంతి!

గుండెలు బ్రద్దలవుతున్నయి,

అయినా ఆ మనసుకి శాంతి ! అంతా శాంతి

అంతటి ప్రళయం లోనూ ఆ మనిషికి విశ్రంతి

 

 

అద్బుతం! అది ఒక అద్బుతం!

మౄత్యువు మనిషికి ఇంతటి శక్తినిస్తుందా!

అద్బుతం! అత్యద్బుతం!

 

 

ప్రశ్న! ఇదినా ప్రశ్న!

అంతటి శక్తి నన్నెప్పుడు వరిస్తుంది?

అది నా గుండెలో మెదులుతున్న ప్రశ్న! ఇది నా ప్రశ్న!

ఎన్నో ఎన్నెన్నో….

Standard

తప్పదన్న మాటున తప్పులెన్నో
పరుల మెప్పు వంకన ఆత్మవంచనలెన్నో
ఆ నలుగురి కోసం చంపుకున్న ఆశలెన్నో
ఎన్నో ఎన్నెన్నో….

కాదన లేక చెప్పిన అవునులెన్నో
అది నిలుపుకోడానికి పడిన పాట్లెన్నో
ఎన్నో ఎన్నెన్నో….

దాటవేసిన ప్రశ్నలెన్నో
రాజి పడిన సంఘటనలెన్నో
ఎన్నో ఎన్నెన్నో….

మరి ఈ జీవిత లో జీవించిన క్షణాలెన్నో?